ఏ విషయంలోనైనా ఎటువంటి భేషజాలు లేకుండా తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా
వ్యక్తం చేస్తుంటుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. తన వ్యక్తిగత విషయాల్ని
పంచుకోవడానికి ఏమాత్రం భయపడనని అనేక సందర్భాల్లో చెప్పిందీ ఈ అమ్మడు. తాజాగా
ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. సినిమాలతో పాటు వారు అడిగిన
వ్యక్తిగత విషయాలపై కూడా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. స్మోకింగ్,
మద్యపానం గురించి కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు శృతిహాసన్ బదులిస్తూ ‘గత
ఆరేళ్లుగా నేను నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నా ఆల్కహాల్, స్మోకింగ్ వంటి
దురలవాట్లకు నేను మొదటి నుంచి దూరంగానే ఉంటున్నా, విరామ సమయాల్లో సంగీతాన్ని
నా హాబీగా చేసుకున్నా’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ప్రభాస్ సరసన
‘సలార్’ చిత్రంలో నటిస్తుంది.