కె ఎస్ జవహర్ రెడ్డి
ఏపి జెఏసి ఛైర్మన్: బండి శ్రీనివాస రావు, సెక్రటరీ జనరల్ జి.హృదయ రాజు
అమరావతి : ఏపీఎన్జీవో నేతలు బండి శ్రీనివాసరావు, హృదయరాజు శనివారం సీఎస్
జవహర్‌రెడ్డిని కలిసి ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. భేటీ అనంతరం
బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈనెల 27న జరిగే జాయింట్ స్టాఫ్
కౌన్సిల్ సమావేశంలో ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై చర్చిస్తామని సీఎస్ హామీ
ఇచ్చినట్టు వెల్లడించారు. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్ ఉద్యోగులుగా మార్చాలని,
దేవాదాయశాఖలో కొన్ని పోస్టులు పెంచాలని సీఎస్‌ను వారు కోరినట్టు వివరించారు.
వీటన్నింటిపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో చర్చిస్తామని సీఎస్
జవహర్‌రెడ్డి తెలిపారని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో మెనూ
ఛార్జీలు సరిదిద్దాలని, పేఅండ్‌అకౌంట్స్ ఆఫీసులో అర్హులకు పదోన్నతి
కల్పించాలని, బకాయిలను నగదు రూపంలో పెన్షనర్లకు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు.
మిగతా ఒప్పంద ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని, మినిమమ్ టైమ్ స్కేల్,
పే, డీఏ ఇవ్వాలని సీఎస్‌కు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు.
దాదాపుగా 30 సమస్యలను ప్రాతినిధ్యం చేస్తూ సీ.యస్ కి వివరించారు. ప్రతి
సమస్యపై చీఫ్ సెక్రటరీ సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా 0 1.0 9.2 0 0 4
నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులకు కేంద్ర
ప్రభుత్వం మెమో ప్రకారం పాత పెన్షన్ విధానంలోకి తేవాలని అదేవిధంగా
ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీమ్ వర్తింప జేయాలని కోరారు. రాష్ట్రంలో
ఔట్సోర్సింగ్, కంటింజెంట్, డైలీ వేజెస్, ఎన్ ఎం ఆర్ లు, ఎం టి ఎస్ విధానంలో
పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒకటో తారీకు జీతాలు చెల్లించాలని, అదేవిధంగా 50%
జీతాలను పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లకు డిఆర్ , పిఆర్సి
బకాయిలను డిసెంబర్ లోపు చెల్లించాలని, ఒకటో తేదీని పెన్షన్లు మంజూరు చేయాలని,
ఈ హెచ్ యస్ లో కమిటీ మెంబర్లుగా చేర్చాలని, 0 2. 0 6.2 0 1 4 నాటికి ఐదు
సంవత్సరాలు పూర్తి నిండిన వారే కాకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం
నియామకమైన మిగిలిన ఉద్యోగులను, అధ్యాపకులను ,సి ఆర్ పి లను రెగ్యులరైజ్
చేయాలని కోరారు. ఇటీవల కాలంలో మంజూరు కాబడిన ఉపవిద్యా శాఖ అధికారులు 74
పోస్టులు, ఎంఈఓ ఒకటి , రెండు పోస్టులను ఉమ్మడి సర్వీసు రూల్స్ ఆధారంగా
పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లతో భర్తీ
చేయాలన్నారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు 60 నుండి 62 సంవత్సరాలు రిటైర్మెంట్
వయస్సు పెంచాలని కోరడం జరిగింది. అదేవిధంగా గురుకులాల్లో/ సొసైటీల్లో
పనిచేస్తున్న సిబ్బందికి 62 సం లకు పెంచుతూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని
కోరారు. పంచాయతీరాజ్ యాజమాన్య ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రికార్డ్
అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్లుగా
అప్‌గ్రేడ్ చేయాలని, పంచాయతీరాజ్ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్‌కు 34%
ఎంపీడీవో కోటాను ఖచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచినందున కారుణ్య నియామకాలలో
రెండు సంవత్సరములు రిలాక్సేషన్ చేస్తూ సవరణ ఉత్తర్వు జారీ చేయాలని,
అగ్రికల్చర్, వెటర్నరీ, స్టేట్ ఆడిట్, ఎండోమెంట్, కమర్షియల్ టాక్స్, శ్రీ
శిశు సంక్షేమ శాఖ పంచాయతీ రాజ్ శాఖ, పే, అకౌంట్ శాఖ తదితర డిపార్ట్మెంట్లలో
ఆయా క్యాడర్లలో పదోన్నతులు, గెజిటెడ్ హోదా, సర్వీస్ మేటర్ విషయంలో న్యాయం
చేయాలని ప్రాతినిధ్యం చేశారు.
సమస్యల పట్ల స్పందిస్తూ ఆయా డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ లకు పంపి
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సి.ఎస్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని
జిల్లాల్లో కారుణ్య నియామకాలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి సత్వర
చర్యలు చేపడుతున్నట్లు సి ఎస్ తెలియజేశారు .అన్ని శాఖలలో ఉన్న సమస్యల
పరిష్కారానికి మూడు దశలుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు త్వరలోనే జాయింట్
స్టాప్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తామని ఏపీ జేఏసీకి తెలిపారు. ఈ సమావేశంలో
ఏపీ జెఎసి చైర్మన్, సెక్రటరీ జనరల్ తో పాటు కో- చైర్మన్లు కె ఎస్ ఎస్ ప్రసాద్
, చంద్రశేఖర్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె వి శివారెడ్డి, ఏపీ జెఎసి కార్యవర్గ
సభ్యులు, ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు చౌదరి పురుషోత్తం నాయుడు, బండి
శ్రీనివాస్,. హరనాథ్, ఇక్బాల్, వేణు మాధవ్, విజయ కుమార్, సేవా నాయక్, నరసింహ,
విద్యా,రాజ్యలక్ష్మి,జానకి,తలసి రత్నం, రంజిత్ నాయుడు,కృష్ణా రెడ్డి,నాగభూషణం,
రంగారావు,రమణ, దాసు తదితరులు పాల్గొన్నారు.