‘సీతారామం’ చిత్రంతో తెలుగులో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది మృణాల్
ఠాకూర్. ఆ సినిమాలో సీత పాత్రలో ఆమె అభినయం అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ
భామ తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. విజయ్
దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్
దర్శకత్వం వహిస్తున్నారు. ‘గీతగోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్
కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్
డాక్యుమెంటరీ డైరెక్టర్ పాత్రలో కనిపించనుందట. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన
ఆమెకు ఇక్కడ హీరో పరిచయం కావడం ఈ సంద్భంలో వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడటం
ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు చిత్ర బృందం.ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా
ప్రారంభోత్సవం జరుపుకుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలు
పెట్టబోతున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.