‘నాకు హద్దుల్లేవు..సరిహద్దుల్లేవు.. రాష్ట్రం విడిపోయినా అందరూ నావాళ్లే
అంటున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ‘భోళాశంకర్’గా ఆయన చేయనున్న సందడిని
ఆగస్టు 11న తెరపైన చూడాల్సిందే. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి
కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘భోళాశంకర్’, తమన్నా కథానాయిక. చిరుకు
చెల్లెలిగా కీర్తిసురేశ్ నటిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రని పోషించారు. ఏకే
ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ
సినిమా టీజర్ ను శనివారం విడుదల చేశారు. ‘మొత్తం 33 మందిని చంపేశాడు. ఒక్కడు’
అంటూ మొదలయ్యే ఈ టీజర్లో ‘షికారుకొచ్చిన ‘షేర్’ అంటూ చిరంజీవి తెలంగాణ యాసలో
చెప్పే మరిన్ని సంభాషణలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. మాస్, యాక్షన్ అంశాలతో
రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి
సంగీతం: మహతి స్వరసాగర్.