మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘చిత్రం
‘ఎమర్జెన్సీ’. బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో
నటిస్తూ.. స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఇందిరాగాంధీ
పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్ తో పాటు విడుదల తేదిని ఇన్
స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది కంగన. ‘రక్షకుడా? నియంతనా? మన దేశ
నాయకుడు తన సొంత దేశంపై యుద్ధం ప్రకటించిన చీకటి ఉందంతానికి మీరు సాక్ష్యంగా
ఉండండి. నవంబరు 24న ఈ చిత్రం విడుదల కానుంది’ అని వ్యాఖ్యల్ని జోడించింది.
ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించి 48 సంవత్సరాలు పూర్తి
చేసుకున్న సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఎంతగానో
ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎమర్జెన్సీ’ అనేది అత్యంత
ముఖ్యమైన చీకటి అధ్యాయాలలో ఒకటి. యువ భారతదేశం తెలుసుకోవలసిన చరిత్ర అని
చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భాన్ని,
ఇందిరాగాంధీ ఎదుర్కొన్న అసమానతలను, ముఖ్యంగా దేశం మొత్తాన్ని శాశ్వతంగా
మార్చిన సంఘటనలను చూపించనున్నారు.