గుంటూరు : అవార్డులు ఎవరికిచ్చినా ప్రతిభ ప్రామాణికంగానే ఇవ్వాలని, అవార్డు
ప్రకటించాక ఆ అవార్డుపై విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలపైనే
వుందని నాటకరంగ ప్రముఖులు, నట కంఠీరవ బిరుదాంకితులు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి
అన్నారు. గుంటూరు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హాలులో ఆదివారం ఉదయం నవ్యాంధ్ర
రచయితల సంఘం గుంటూరుజిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘కవిమిత్రుల కలయిక-కవి సమ్మేళనం’
కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాధాకృష్ణమూర్తి
మాట్లాడుతూ- ద్రౌపది పాత్రతో నాటక రంగంలో ప్రవేశించానని, తర్వాత దుర్యోధనుడి
పాత్ర కొన్ని వేలసార్లు పోషించానని అన్నారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు
పొందానని, అప్పట్లో అవార్డులపై ఎప్పుడూ విమర్శలు వచ్చేవి కాదన్నారు.
నాటకరంగంలో కొనసాగుతూనే జంధ్యాల పాపయ్యశాస్త్రి, గుర్రం జాషువా గార్ల పద్యాల
సాహచర్యంతో పద్యాలు కూడా రాయగలిగానని ఆయన అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన డా. తూములూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ-ప్రతిమాసం ఒక
మంచి పుస్తకాన్ని సమీక్షిస్తూ, కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని,
కవిసమ్మేళనంలో పాల్గొనే కవులకు ప్రోత్సాహకాలందిస్నున్నామన్నారు. ‘శ్యామ’
పుస్తక అనువాదకులు కందిమళ్ళ శివప్రసాద్ మాట్లాడుతూ- భారతం, రామాయణం అనువాద
కావ్యాలేనన్నారు. మన పురాణ గ్రంథాలన్నీ అనువాదాలే నన్నారు. అనువాదాల వల్ల
అక్కడి భాషలోని సౌందర్యంతో పాటు అక్కడి చరిత్ర, సంస్కృతి తెలుస్తుందన్నారు.
డా.వంగిపురపు శారదాదేవి రవీంద్రనాధ్ ఠాగోర్ ‘శ్యామ’ తెలుగు అనువాద పుస్తకాన్ని
సమీక్షిస్తూ- రవీంద్రనాథ్ ఠాగోర్ రచనలు చదివినవారు భావోద్వేగానికి లోనుకాకుండా
వుండలేరన్నారు. తెలుగు అనువాదం మరింత భావేద్వేగానికి గురిచేసిందన్నారు.
నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ- కొత్తతరాన్ని
ప్రోత్సహించకపోతే భవిష్యత్తరాల సాహితీరంగమంతా శూన్యంగా మారే ప్రమాదముందన్నారు.
నవ్యాంధ్ర రచయితల సంఘం కొత్త కవుల్ని, రచయితల్ని తయారు చేసే ప్రధాన
లక్ష్యంతోనే పని చేస్తుందన్నారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో సౌపాటి
ప్రభాకర్, ఆళ్ళ నాగేశ్వరరావు, రహీమ్ సాహెబ్, కారంచేటి విజయ్ కుమార్, గోలి
హనుమచ్ఛాస్త్రి, తాటికోల పద్మావతి, యక్కంటి పద్మావతి, మన్నం వెంకటగురువు,
కొణతం నాగేశ్వరరావు, కె. లీలాకృష్ణ, బాబూ మస్తాన్, పింగళి భాగ్యలక్ష్మి, మండే
సుబ్రహ్మణ్యం పాల్గొని తమ కవితల్ని వినిపించారు. ఉత్తమ కవిత రాసిన మండే
సుబ్రహ్మణ్యంని ముఖ్య అతిధి తుర్లపాటి రాధాకృష్ణమూర్తి చేతుల మీదుగా నగదు
బహుమతితో సత్కరించారు. ముఖ్యఅతిధిని నిర్వాహకులు విలువైన పుస్తకం, శాలువాతో
సత్కరించారు. బండికల్లు జమదగ్ని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.