అనంతపురం : దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుకూల పవనాలు వీస్తున్నాయనీ,
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు విద్వేష రాజకీయాలు చేస్తూ ప్రజా
వ్యతిరేకతను కూడగట్టుకున్నారని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు.
ఆదివారం అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ సమన్వయ కమిటీలతో
సమావేశానికి హాజరైన సంధర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి
భద్రతలు పూర్తిగా క్షీణించాయనీ, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని సామాన్య
ప్రజలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు,
నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ ఇబ్బందులను
ఎదుర్కోకొంటున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత ప్రజలు
కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఏపిలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంటుందని
అన్నారు.
దివంగత వై యస్ రాజశేఖరెడ్డి బతికి ఉండగా రాహూల్ గాంధీ నీ ప్రధాని చేయాలని
పిలుపు నిచ్చారని, ఆయన ఆకాంక్షలకి అనుగుణంగా వైస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్
పార్టీ లోకి వస్తె స్వాగతం చెబుతామన్నారు
ఏఐసీసీ కార్యదర్శి శ్రీ మెయప్పన్, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా
గౌతమ్,యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు, ఏపీసీసీ కో ఆర్డినేషన్
కమిటీ సభ్యులు శ్రీ రామ మూర్తి, ఏపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
దాదా గాంధి, ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ సాకే శంకర్, డీసీసీ అధ్యక్షుడు
ప్రతాపరెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.