రెడ్డి ప్రభుత్వం బీచ్ ఐటీ కాన్సెప్ట్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండడంతో
దిగ్గజ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా
వేదికగా ఆదివారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఈ నెల 28న విశాఖలో ప్రముఖ
దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ
మేరకు రుషికొండ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం కూడా
పూర్తయ్యిందని అన్నారు. ఇదే బాటలో ఇన్ఫోసిస్, విప్రో,ఐబీఎం, టీసీఎస్ సంస్థలు
విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయని అన్నారు.
రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
దశాబ్దాల తరబడి వేధించిన లక్షలాది భూ సమస్యలకు భూముల రీసర్వే ద్వారా శాశ్వత
పరిష్కారం లభిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు నిర్వహిస్తున్న భూ
సర్వే విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. 2 వేల గ్రామాల్లో ఇప్పటికే సర్వే
పూర్తయ్యిందని, 2 లక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సబ్ డివిజన్లతో లక్షల మంది
రైతులకు మేలు జరిగిందని అన్నారు. దీంతో 20 వేలకుపైగా భూ వివాదాల పరిష్కారం
అయ్యాయని తెలిపారు.
కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటే లాభమేంటి
కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే బదులు విపక్ష పార్టీలు ఎవరికివారే
ప్రజాక్షేత్రంలోకి వెళితే ఎవరి బలమెంతో మరింత స్పష్టంగా తెలిసిపోతుందని
విజయసాయిరెడ్డి అన్నారు . అప్పుడు ఈ ముసుగులో గుద్దులాటల అవసరం ఉండదని
అన్నారు. అలాగే
పచ్చ మీడియాలో రాతల మర్మం ఏంటో ప్రజలకు తెలియంది కాదని అన్నారు.
టీడీపీ నేతలకు పల్లకీ మోయని వారంతా శత్రువులుగానే కనిపిస్తారు
విపక్ష టీడీపీ నాయకులు వారి పల్లకీ మోయని వారందర్నీ శత్రువులుగా చూస్తే
రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు వారికి శత్రువులే అవుతారని గుర్తుంచుకోవాలని
విజయసాయిరెడ్డి అన్నారు. అలా అయితే రాష్ట్రంలో వారికి మిత్రులే లేకుండాపోతారని
ఆయన అన్నారు.