గుంటూరు : కంతేరు దళితులపై దాడికి పాల్పడిన కళ్లం హరికృష్ణారెడ్డి పై ఎస్సీ ,
ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో
సభ్యుడు వర్ల రామయ్య ఏపీ డీజీపీ కి లేఖ రాశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ
మీడియాతో మాట్లాడుతూ కంతేరు దళితులపై వైసీపీ యువజన విభాగం నాయకుడు కళ్లం
హరికృష్ణారెడ్డి దాడి చేయడం అమానుషమని అన్నారు. శామ్యూల్ అనే దళిత యువకుడిపై
అత్యంత దారుణంగా దాడి చేసి గాయపరిచారని, దాడి జరిగి 48 గంటలు గడుస్తున్న
నేరస్తులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో
శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని, కొంతమంది పోలీసులు అధికారపార్టీకి
తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కళ్లం
రామకృష్ణారెడ్డి, అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మర్డర్ కేసు
నమోదు చేసేలా సంబంధిత పోలీసులను ఆదేశించాలని, దళితులపై ఇటువంటి దాడులు
పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.