మనందరికీ తెలిసిందే. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ను వంట
గదిలో అలాగే ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఇదివరకు రోజుల్లో ఈ ఆపిల్
సైడర్ వెనిగర్ చాలా తక్కువగా దొరికేది. కానీ ప్రస్తుతం అన్ని సూపర్
మార్కెట్లలో సులభంగా లభిస్తోంది. ఇదే ఇందులో అనేక రకాల ప్రయోజనాలు దాగి
ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. రాత్రి సమయంలో పడుకునే ముందు యాపిల్
సైడర్ వెనిగర్ ను తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి.
రాత్రి సమయంలో సైడర్ వెనిగర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం
తెలుసుకుందాం..
యాపిల్ సైడర్ వెనిగర్ కడుపు ఖాళీ చేయడాన్ని నెమ్మదిస్తుంది. కాబట్టి
రాత్రిపూట దీన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా
చేస్తుంది. అలాగే, భోజనానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల ఇన్సులిన్
సెన్సిటివిటీ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. యాపిల్ సైడర్
వెనిగర్ కొవ్వు నిల్వను తగ్గించి ఆకలిని అరికడుతుంది. జీర్ణక్రియను
నెమ్మదిస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఆకలి హార్మోన్ల
విడుదలను ఆలస్యం చేస్తుంది. ఒక వ్యక్తి 12 వారాల పాటు పడుకునే ముందు 1 టేబుల్
స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే, వారు పొత్తికడుపు వద్ద పేరుకున్న
కొవ్వు కరిగిపోతుంది.
అలాగే నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తగ్గించే శక్తి యాపిల్ సైడర్
వెనిగర్ కి ఉంది. రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు నీళ్లలో 1 టేబుల్ స్పూన్
యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకుంటే నోటిలోని
బ్యాక్టీరియా తగ్గి ఉదయం నోటి దుర్వాసన తగ్గుతుంది. ఎక్కిళ్ళు సమస్యతో
బాధపడేవారు.. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఎక్కిళ్లను కలిగించే
గొంతులోని నరాలను ఉత్తేజపరిచి నిమిషాల్లో ఎక్కిళ్లను నయం చేస్తుంది. మీరు
చేయాల్సిందల్లా 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం. మీకు తరచుగా ముక్కు
కారడం ఉంటే, కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ తాగండి. యాపిల్ సైడర్ వెనిగర్ లో
విటమిన్ బి, పొటాషియం మెగ్నీషియం ఉన్నాయి. ఇవి సైనస్ ఇన్ఫెక్షన్ల
నుండిఉపశమనాన్ని అందిస్తాయి. అలాగే శ్వాస తీసుకోవడంలో
సహాయపడతాయి.