ఆన్లైన్ ట్రోలింగ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సీనియర్ కథానాయిక
ప్రియమణి. తన పెళ్లి సమయంలో ఎన్నో విమర్శలొచ్చాయని, తాను
ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘నా శరీరం రంగు
బాగాలేదంటూ ఇప్పటికీ బాడీ షేమింగ్ చేస్తుంటారు. అయితే నా పెళ్లి సమయంలో మాత్రం
ఆన్లైన్ ట్రోలింగ్ శృతి మించింది. ముస్లిమ్ వ్యక్తిని ఎందుకు పెళ్లి
చేసుకున్నావంటూ దూషించారు. అనేక రకాలుగా కామెంట్స్ పెట్టారు. ఎవరి వ్యక్తిగత
జీవితం వారిది. ఇతరులు జీవితాల్లోకి తొంగి చూడటం మంచిది కాదు. సమాజంలో
విమర్శించే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. అందుకే ట్రోల్స్ గురించి పట్టించుకోవడం
పూర్తిగా మానేశాను. అప్పటి నుంచి మానసిక ప్రశాంతత లభించింది’ అని చెప్పింది.
2017లో వ్యాపారవేత్త ముస్తఫా రాజు ను వివాహం చేసుకుంది ప్రియమణి. ప్రస్తుతం
ఆమె షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది ప్రియమణి