కాజల్,రెజీనా ప్రధాన పాత్రల్లో కార్తికేయన్
(డీకే) తెరకెక్కించిన తమిళ
చిత్రం ‘కరుంగాపియం’. ఇప్పుడీ సినిమాని ‘కార్తీక పేరుతో తెలుగు ప్రేక్షకుల
ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత టి. జనార్దన్. దీన్ని ముత్యాల రాందాస్
సమర్పిస్తున్నారు. ఈ చిత్రం జులై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత
జనార్దన్ మాట్లాడుతూ.. “హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన
చిత్రమిది. ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుంది. రెజీనా ఓసారి లైబ్రరీకి వెళ్లి వంద
ఏళ్ల క్రితం నాటి కాటుక
బొట్టు అనే పుస్తకం చదువుతుంది. ఆమె అది చదువుతుంటే అందులోని పాత్రలు
దెయ్యాలుగా మారి తన ముందుకు రావడం థ్రిల్ కలిగిస్తుంది. ఈ చిత్రంలో
ప్రతీకారంతో రగిలి పోయే దెయ్యం పాత్రలో కాజల్ కనిపిస్తుంది” అన్నారు. ఈ
సినిమాలో జననీ అయ్యర్, నోయిరికా, రైజూ విల్సన్ తదితరులు కీలక పాత్రలు
పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రసాద్ ఎస్.ఎన్.