సమావేశం
సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్
రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి.రత్నం
విజయవాడ : ఉద్యోగులందరికీ ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ
వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా
అన్నారు. సమావేశంలో సచివాలయ ఉద్యోగుల సమస్యల పై రాష్ట్ర అధ్యక్షుడు
ఎం.డి.జాని పాషా మాట్లాడుతూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ దృష్టికి
సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి వివరించి పరిష్కార మార్గాలు సూచించారు.
వాటిలోని సమస్యలు, ఏ ప్రభుత్వ ఉద్యోగి లేని యూనిఫామ్ తొలగించాలని, ఉద్యోగులకు
యూనిఫామ్ వలన ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి
ఉద్యోగులుగా పరిగణిస్తున్న కారణంగా యూనిఫామ్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని
కోరారు. విధుల్లో చేరిన మొదటి రోజునుండి నోష్నల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని,
జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేయాలని, ఉద్యోగులందరికీ ప్రమోషన్ ఛానల్స్
కల్పించాలని, ఆలస్యంగా ప్రొబేషన్ డిక్లేర్ చేసిన కారణంగా ఆలస్యమైన కాలానికి
అరియర్స్ చెల్లించాలని, వ్యవసాయ అనుబంధ సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కల్పించి
న్యాయం చేయాలని, ఎనర్జీ అసిస్టెంట్లకు భద్రతాపరికరాలు ఇవ్వాలని,ఆఫీస్
మైంటెనెన్సు కు సంభందించి ఒక అటెండర్ ని నియమించాలని,సెలవులు మంజూరులో క్షేత్ర
స్థాయి అధికారులు ఇబ్బందికి గురి చేస్తున్నారని,ఎంప్లాయిస్ హెల్త్ కార్డుల
సమస్యల గురించి, పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-5 వారికి పూర్తి స్థాయి గ్రామ
పంచాయతీల పరిపాలనా బాధ్యతలు కల్పించాలని,వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్
సెక్రటరీలకు సచివాలయ పనివేళలు కల్పించాలని,యూజర్ ఛార్జ్ కలెక్షన్ నుండి
విముక్తి కల్పించాలని,గ్రామ సచివాలయ ఉద్యోగుల హోదాలో అసిస్టెంట్ కు బదులుగా
సెక్రటరీగా మార్పు చేయాలని,క్యాజువల్ లీవ్స్ మంజూరు ఒకటి నుండి మూడు రోజుల
వరకు పంచాయతీ కార్యదర్శులు-5 వారికి, వార్డు పరిపాలన కార్యదర్శులకు
కల్పించాలని, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు, డిజిటల్
అసిస్టెంట్లకు టెక్నికల్, ఎడ్యుకేషన్ విభాగంలో ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ
మాట్లాడారు. అత్యంత సానుకూలంగా స్పందించిన సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్
సెక్రటరీ అజయ్ జైన్, సెక్రటరీ దివాన్, డైరెక్టర్ లక్ష్మీ షా తదితర అధికారులు
ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.