అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో
ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్)
కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. బీజేపీ మహాజన్ సంపర్క్
అభియాన్‌లో భాగంగా ఈ నెలాఖరులోపు ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉండగా
కార్యక్రమం వాయిదా పడిందని, జులై 12న వస్తారని పార్టీ ముఖ్య నేతలు తెలిపారు.
అదే రోజు వరంగల్‌లో సభ నిర్వహించేందుకు చర్చిస్తున్నామని, రెండు రోజుల్లో
ప్రధాని పర్యటన ఖరారు అవుతుందన్నారు.
జులై 8న బీజేపీ నేతల కీలక సమావేశం : హైదరాబాద్ వేదికగా జులై 8న ఏకంగా 11
రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం
నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ
కీలక సమావేశం పార్టీపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ నాయకత్వం
భావిస్తోంది. అందుకే వివిధ రాష్ట్రాల పార్టీ బాధ్యులతో కీలక సమావేశానికి
హైదరాబాద్‌ను వేదిక చేసుకున్నట్లు తెలిసింది.
నేడు 600 మంది ఇతర రాష్ట్రాల కార్యకర్తలు : బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన
600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్రానికి రానున్నారు. భోపాల్‌లో
జరిగిన ‘మేరా పోలింగ్ బూత్… సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో పాల్గొన్న వీరు
ప్రత్యేక రైలులో రాష్ట్రానికి చేరుకుంటారు. మంచిర్యాల, కాజీపేట,
సికింద్రాబాద్‌లలో మూడు బృందాలుగా విడిపోతారు. వీరంతా జులై 5 వరకు
రాష్ట్రంలోనే ఉండి బీజేపీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలు చేపడతారు.
భోపాల్‌లో ప్రధాని కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జి.ప్రేమేందర్‌రెడ్డి వీరిని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు.