హైదరాబాద్: కొత్త వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను ఏర్పాటు చేయాలని సీఎస్
శాంతికుమారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూటీఎస్ నేతలు
కోరారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన
కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, సంఘ బాధ్యులు దామోదర్‌రెడ్డి, శశిధర్‌శర్మ,
ఆనంద్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డి
తదితరులు సచివాలయంలో సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

రెవెన్యూ శాఖలో పదోన్నతులపై కసరత్తు : రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్
నుంచి సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దారు పోస్టుల వరకు పదోన్నతులు
కల్పించేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం కసరత్తు చేస్తోంది.
జోనల్ స్థాయిలో ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు రూపొందిస్తున్నారు. ప్రక్రియను
సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ పర్యవేక్షిస్తున్నారు.