విజయవాడ : మాజీ ప్రధాని, బహుభాషా కోవిదులు పివి నరసింహారావు 102 వ జయంతి
సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పివి కి ఘన నివాళులు అర్పించారు. విజయవాడ
ఆంధ్ర రత్న భవన్ లో పీవీ నరసింహారావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా
నిర్వహించారు. విజయవాడ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పివి
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్
పార్టీకి, భారతదేశానికి ఎనలేని సేవ చేశారని, ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన
మేధావి అని నరహరిశెట్టి నరసింహారావు కొనియాడారు. ఏఐసీసీ సభ్యులు మేడా సురేష్
మాట్లాడుతూ భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన రాజకీయ నీతిజ్ఞుడు అని
ప్రపంచీకరణ, ఆర్థికీకరణ, సరళీకరణ విధానాలను అమలు చేసిన ఏకైక ప్రధాని పీవీ
నరసింహారావు అని పీవీ చేసిన సేవలను వివరించారు. ఈ జయంతి కార్యక్రమంలో లీగల్
సెల్ చైర్మన్ వి. గురునాథం, ఏఐసీసీ సభ్యులు కొలనుకొండ శివాజీ ,మేడ సురేష్,
ఎండి గౌస్, భూదాల జోసెఫ్, సూర్య ప్రకాష్ ,షేక్ నాగూర్ తదితర కాంగ్రెస్
నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.