ఉపయోగించండి.
దోమలు తడి ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి నీటి నిల్వ ఉండకుండా
చూసుకోవాలి. ఇల్లంతా తడిగా ఉంటే , దోమలు వస్తాయని గుర్తుంచుకోండి.
*ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే కాస్త గోరు
వెచ్చని నీళ్లను తాగితే మంచిది.
*మొలకెత్తిన గింజలు, నారింజ, తాజా కూరగాయలు, పండ్లు తినాలి. దీనివల్ల
సి-విటమిన్ లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
*ఇంట్లో ఆహారానికి కాస్త గాలి తగిలేట్లు ఉంచండి. బయట బురద దగ్గర ఉండే షాపుల్లో
ఆహారపదార్థాలు, జంక్ ఫుడ్ తినటం మానేయాలి. తాజా ఆహారాన్ని మాత్రమే తినాలి.
*ఆ ఇంట్లో బట్టలు ఒకే చోట వేయడం, తడిచిన బట్టలు కుప్పగా వేయటం వల్ల దోమల
సమస్యతో పాటు బ్యాక్టీరియా సమస్య ఉత్పన్నమవుతుంది.
*ఇంట్లో బట్టలు ఒకే చోట వేయడం, తడిచిన బట్టలు కుప్పగా వేయటం వల్ల దోమల సమస్యతో
పాటు బ్యాక్టీరియా సమస్య ఉత్పన్నమవుతుంది.
*పాల ఉత్పత్తులైన వెన్న, నెయ్యికి దూరంగా ఉండటం మంచిది. అయితే తాజా పెరుగును
తింటే మంచిది. ఇక కారం ఉండే ఆహారాన్ని తినకూడదు. సులువుగా జీర్ణమయ్యే
ఆహారాన్నే తినాలి.
వా*తావరణం చల్లబడినపుడు వర్కవుట్స్ చేయటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఇక
హెర్బల్ టీ లాంటివి తాగటానికి ఆసక్తి చూపితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
*చేతుల్ని శుభ్రంగా కడిగి తినాలి. బయటకు వెళ్లేప్పుడు గొడుగులు, రెయిన్ కోట్లు
తీసుకెళ్లటం మంచిది.
త*డి బట్టలు, తడి షూస్ తడి తువాళ్లు వాడకపోవటమే మంచిది. ఎల్లప్పుడు పొడిగా
ఉండే బట్టలను ఉపయోగించాలి.
*దుమ్ము జోలికి వెళ్లటం లాంటి పనులు చేయకూడదు.
* ఇతరులెవరైనా జ్వరాల బారిన పడితే దూరంగా ఉండటం మంచిది. లేకుంటే మీకూ ఆ సమస్య
వస్తుంది.
*ఇంట్లో సింక్ తో పాటు వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త
ఉండకుండా చూసుకోవాలి.
*వానలు పడినప్పుడు ఇంట్లో కరెంటు కనెక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.