అదృష్టం అంటే శ్రీలీలదే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం తెలుగు
చిత్రసీమలో ఈ భామ జోరుమీదుంది. వరుసగా అగ్ర హీరోలతో జోడీ కడుతూ కెరీర్లో
దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో దాదాపు ఎనిమిది చిత్రాలున్నాయి.
అనతికాలంలో ఈ అమ్మడు తారాపథంలో అగ్ర స్థానానికి చేరుకోవడానికి చాలా అంశాలు
ప్లస్ అయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో నాయికల కొరత ఉండటం శ్రీలీలకు
బాగా కలిసొచ్చిందని అంటున్నారు. బెంగళూరులో పుట్టి పెరిగినప్పటికీ శ్రీలీల
కుటుంబ నేపథ్యం తెలుగు కావడం కూడా అడ్వాంటేజ్ గా మారిందంటున్నారు. తెలుగులో
చక్కగా డబ్బింగ్ చెప్పడం కూడా శ్రీలీలకు ప్లస్ పాయింట్ గా మారింది. అంతేకాక
డ్యాన్స్ విషయంలో కూడా శ్రీలీల చక్కటి ప్రతిభ కనబరుస్తుంటుంది. ఈ అంశాలన్నీ ఈ
భామకు యువతరంలో మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయని, అందుకే వరుస అవకాశాలు
వరిస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల..గుంటూరు
కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండ, నితిన్
సిని మాల్లో నాయికగా నటిస్తున్నది.