హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు
సాయిచంద్ మృతిపై పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి
వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్
గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్,
జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ తదితరులు సంతాపం వ్యక్తం
చేశారు. తెలంగాణ రాష్ట్ర ఓ గొప్ప గాయకున్ని, భవిష్యత్ నాయకున్నీ
కోల్పోయింది. తన ఆటపాటతో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచందర్
విశేషమైన పాత్ర పోషించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని శాసన మండలి
ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తమ్ముడు సాయిచంద్ అకాల మరణం
ఎంతో బాధకు గురిచేసింది. ఆయన తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర
పోషించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఉద్యమంలో సాయిచంద్ పోషించిన పాత్రను
తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో అందరి
గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన
కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మంత్రి హరీశ్‌రావు
పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. ఉద్యమం, రాష్ట్ర
పునర్నిర్మాణంలో సాయిచంద్ పాత్ర కీలకం. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలి. సాయిచంద్
కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ సేవలు
చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి జగదీశ్‌రెడ్డి
పేర్కొన్నారు.