news descriptionఅమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా
పరిచయమైన ఆసిన్, ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో వన్ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్
హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. శివమణి, గజిని, ఘర్షణ వంటి చిత్రాలు ఆమెకు
మంచి గుర్తింపును తెచ్చాయి. కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆసిన్
నటించింది. ఆ తరుణంలోనే పారిశ్రామికవేత్త రాహుల్ శర్మను ప్రేమించి
పెళ్లిచేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైనా అసిన్ తాజాగా ఆమె భర్తతో
దిగిన ఫోటోలను ఇటీవల ఇన్ స్ట్రా గ్రామ్ లో తొలగించడంతో ఆమె భర్తతో విడాకులు
తీసుకోనుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆసిన్ స్పందించారు. సెలవులను
ఎంజాయ్ చేస్తున్న తరుణంలో కొన్ని వార్తలు మాకు కనిపించాయి. వాటిని చూశాక,
పెళ్లి కోసం ఇరుకుటుంబాలను, పెద్దలను ఒప్పించిన ఆనాటి రోజులు గుర్తుకు
వచ్చాయి. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాం అంటూ వస్తోన్న వార్తలలో ఎలాంటి
నిజం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి.మేము సంతోషంగా ఉన్న సమయం లో
ఇలాంటి వార్తలు రావడం చాలా బాధకరం అంటూ చెప్పుకొచ్చింది అసిన్.