బాలీవుడ్ కథానాయకుడు రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాకీ
ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ
సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ
సినిమాలోని ‘తుమ్ క్యా అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. కశ్మీర్
అందాల మధ్యలో సాగిన ఈ పాటలో రణవీర్, అలియా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను
ఆకట్టుకుంటోంది. ఈ గీతాన్ని తన గురు వైన యశ్ చోప్రాకు అంకితం చేస్తున్నట్లు
సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు కరణ్ జోహార్. ‘నేను మొదట్లోనే నా గురువు
యశ్ చోప్రాకు నివాళులు అర్పించడానికి ఒక ప్రేమగీతాన్ని చిత్రీకరించాలని
అనుకున్నాను. అనుకున్నట్లు గానే నా ఆలోచన నిజమైంది’ అని వ్యాఖ్యల్ని
జోడించారు. కశ్మీర్ అందాల మధ్యలో అలియా భట్, రణ్ వీర్ ల జంట మధ్య సాగిన గీతం
ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రలు
పోషిస్తున్నారు. ఈ చిత్రం జులై 28న ప్రేక్షుకుల ముందుకు రానుంది.