వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం అవాస్తవం
అమ్మఒడి కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి రూ.13వేలు ఇస్తారా?
మేం 74 లక్షల మందికి పింఛన్ ఇస్తే..మీరు 62 లక్షల మందికే ఇస్తారా?
గత నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందుతోందా
మద్య నిషేధమంటూ ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయలేదు
వాస్తవ పత్రం విడుదల చేసిన టీడీపీ నేతలు
ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
గుంటూరు : జగన్ చెప్పేవన్నీ అసత్యాలేనని, ఒక్కటి కూడా నిజం ఉండదని ఏపీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
‘ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు’ పేరిట తెలుగుదేశం పార్టీ
రూపొందించిన వాస్తవ పత్రాన్ని ఆయన విడుదల చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో 99
శాతం హామీలు అమలు చేశారనడం అవాస్తవమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
అచ్చెన్నాయుడు విమర్శించారు.‘ ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు’
పేరిట తెదేపా రూపొందించిన వాస్తవ పత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
అచ్చెన్న మాట్లాడారు. జగన్ చెప్పేవన్నీ అసత్యాలేనని, ఒక్కటీ నిజం ఉండదని
ఆరోపించారు. ఎన్నికల ముందు ఒకటి చెప్పి అధికారంలోకి వచ్చాక మరొకటి
చేస్తున్నారని విమర్శించారు. అమ్మఒడి కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి
రూ.13వేలు ఇస్తారా? అని ఆయన నిలదీశారు.
రాష్ట్రంలో 84 లక్షల మంది ఉంటే 42 లక్షల మందికే పథకాన్ని వర్తింపజేయటం ఏంటని
అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ‘తల్లికి
వందనం’ కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి మహిళకు రూ.15వేలు ఇవ్వాలని
నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో పింఛన్ రూ.200 ఉంటే రూ.1800 పెంచి రూ.2 వేలు
ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా మందుల కొరత లేకుండా
చేశామని చెప్పారు. గత నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం
అందుతోందా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘‘మేం 74 లక్షల మందికి పింఛన్
ఇస్తే మీరు 62 లక్షల మందికే ఇస్తారా?. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10
లక్షల మందికి పింఛన్లు తొలగించడం వాస్తవం కాదా?. ఏవేవో సాకులతో పేదవాడి
పథకాలన్నీ తీసేసి మోసం చేస్తున్నారని విమర్శించారు.
తప్పుడు ప్రచారాలతో ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారు. రైతు భరోసా కింద 12
హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 8 హామీల్లో
ఒక్కటీ అమలు కాలేదన్నారు. పించన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో 2 అమలు
కాలేదని, అమ్మఒడి కింద ఇచ్చిన 2 హామీలు కూడా పెండింగ్లోనే ఉన్నాయని,
పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5 హామీలూ అమలు కాలేదని, బోధనారుసుం కింద
ఇచ్చిన 2 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన
హామీలన్నీ పెండింగ్లోనే ఉన్నాయని, మద్య నిషేధమంటూ ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు
అమలు చేయలేదని అచ్చెన్న ఆరోపించారు.
జగన్రెడ్డి మోసపు లీలలు పేరుతో టీడీపీ వాస్తవ పత్రం విడుదల : నవరత్నాల పేరుతో
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తొమ్మిదైతే వాటికింద 40 హామీలు ఉన్నాయని
తెలుగుదేశం పేర్కొంది. చెప్పిన మేరకు చేయని హామీలు 39 ఉన్నాయంటూ గురువారం
టీడీపీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ‘ప్రకాసించని నవరత్నాలు…జగన్ రెడ్డి
మోసపు లీలలు’ పేరుతో తెలుగుదేశం వాస్తవ పత్రాన్ని విడుదల చేసింది. నవరత్నాల
పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తొమ్మిదైతే వాటికింద 40 హామీలు
ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామంటూ వైసీపీ
చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన హామీలు 10
శాతం మాత్రమే అని, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు.
రైతు భరోసా కింద రూ.13500 ఇస్తానని చెప్పి ఇచ్చేది రూ.7500 మాత్రమే అని
తెలిపారు.
రైతు భరోసా కింద 12 హామీలు ఇస్తే ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. వైఎస్సార్
ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో 8 అమలుకాలేదని అన్నారు. ఫించన్ల పెంపు కింద
ఇచ్చిన మూడు హామీల్లో రెండు అమలుకాలేదని తెలిపారు. అలాగే అమ్మఒడి కింద ఇచ్చిన
రెండు హామీల్లో రెండూ అమలు కాలేదని, పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన ఐదుు
హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. బోధనా రుసుము చెల్లింపు కింద ఇచ్చిన రెండు
హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన
మూడు హామీలకు మూడూ పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. మద్యనిషేధం అంటూ ఇచ్చిన
ఒక్క హామీ ఇంతవరకు అమలుకాలేదన్నారు. వైఎస్సార్ ఆసరా, చేయూతల కింద ఇచ్చిన
నాలుగు హామీల్లో నాలుగు పెండింగ్లోనే ఉన్నాయని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.