విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అకడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
(డీఎంఈ) ఛాంబరులో నూతనంగా నియమితులైన డీఎంఈ డాక్టర్ రఘునందన్‌ని
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ రాష్ట్ర అధ్యక్షురాలు డి.మంజులాదేవి, వారి
బృందం బుధవారం కలిసింది. నూతనంగా నియమితులైన డీఎంఈకి మంజులాదేవి, బృందం
శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ తాను కర్నూలు
జిజిహెచ్‌లో హెచ్ఓడి, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పెషల్ ఆఫీసర్లుగా,
సుదీర్ఘంగా పని చేశానని, ఆ కాలంలో మంజుల ఆపరేషన్ థియేటర్ ఇన్చార్జిగా చాలా
నిబద్దతతో పనిచేశారని గుర్తుచేశారు. ప్రతి పనిలోనూ సేవదృక్ఫథంతో కూడిన
బాధ్యతను ఆమె నిర్వహించేందని ప్రశంసించారు. అందుకే చాలామందికి మంజుల అంటే మంచి
గౌరవమని కితాబిచ్చారు. నిరంతరం నర్సుల సమస్యల పరిష్కారానికి ఆమె చిత్తశుద్ధితో
పనిచేసే వారన్నారు. నర్సుల ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ ఆమె ప్రభుత్వం
దృష్టికి తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. అనంతరం గుంటూరు జీజీహెచ్ మెడికల్
సూపరింటెండెంట్‌గా నియమితులు కానున్న డాక్టర్ కిరణ్‌కుమార్‌ను మంజులాదేవి
కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.