ఖమ్మం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం
విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్
మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పాలేరు నుంచి మొదలై ఖమ్మం
గ్రామీణం మండలం తల్లంపాడు వరకు సాగింది. కూసుమంచిలో జరిగిన సభలో భట్టి
విక్రమార్క మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం, నిరుద్యోగులకు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదలకు ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం
విఫలమైందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల
పనులు 70 శాతం పూర్తయినా వాటిని కొనసాగించకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు.
సీతారామ ప్రాజెక్టు పనులను సక్రమంగా చేపట్టడం లేదన్నారు. అటవీ భూములపై
గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు కల్పించిందని, వారిని అడవి నుంచి
పంపించేందుకు భారాస సర్కారు కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. సింగరేణి బొగ్గు
గనులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. డీసీసీ
అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జడ్పీ మాజీ ఛైర్మన్ చందా లింగయ్య దొర,
పీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.