వేరు శనగ(పల్లి)లలో లిపిడ్లు, ఫాస్పరస్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్
ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు
చెబుతున్నారు. అయితే ఈ పల్లీలను నానబెట్టి ప్రతిరోజూ ఉదయం తినడం వల్ల అనేక
లాభాలున్నాయి.
1)కండరాల బలం
వేరు శనగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి
కండరాల దృఢత్వానికి సహాయపడతాయి. నానబెట్టిన పల్లీలు కండరాలు టోన్ చేయడంలో
ఉపయోగపడుతాయి. కండలు పెంచుకోవాలనుకునే వారు నానబట్టిన పల్లీలు తినడం మంచిది.
2)జీర్ణశక్తి:
పల్లీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపర్చడంలో
సహాయపడుతుంది. నానబెట్టిన పల్లీలు ప్రతిరోజూ ఉదయం తినడం వల్ల గ్యాస్,
ఎసిటిడీ తగ్గుతుంది.
3)గుండె ఆరోగ్యం:
నానబెట్టిన పల్లీలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల గుండె
ఆరోగ్యం పెంచుకోవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు
రాకుండా ఇవి దోహదపడతాయి.
4)క్యాన్సర్:
నానబెట్టిన పల్లీల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్
తో పోరాడతాయి. ప్రాణాంతక క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి.
పల్లీల్లోని ఐరన్, ఫోలెట్స్, కాల్షియం,
జింక్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగింపజేస్తాయి.
5)వెన్నునొప్పి:
అధిక పనిభారం వల్ల చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. రోజంతా కూర్చోవడం
వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాంటి వారు రోజూ నానబెట్టిన పల్లీలను బెల్లంతో
కలిపి తింటే
ప్రయోజనం చేకూరుతుంది.
6)జ్ఞాపకశక్తి:
వేరుశనగల్లోని విటమిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన
పల్లీలు తినడం వల్ల పిల్లలు, పెద్దల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
7)చర్మ సంరక్షణ:
పల్లీల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ‘ చర్మ సౌందర్యాన్ని
కాపాడతాయి. నానబెట్టిన వేరుశనగలు రోజూ తినడం వల్ల చర్మం మెరుపును
కాపాడుకోవచ్చు.
(గమనిక:వేరుశనగల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని మితంగా
తీసుకోవడమే మంచిది. రాత్రిపూట వీటిని అస్సలే తినకూడదు. జీర్ణసంబంధ సమస్యలతో
పాటు బరువు పెరుగుతారు.)