మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు.
బుల్దానాలోని సమృద్ధి మార్గ్ ఎక్స్ప్రెస్ హైవేపై శనివారం వేకువజామున 2 గంటలకు
ఈ ఘటన జరిగింది. యావత్మాల్ నుంచి పుణెకు 32 మంది వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా
మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన సహాయక
చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బస్సు
పూర్తిస్థాయిలో కాలిపోయింది.