విశాఖపట్నం : సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి
అయ్యాయి. రేపు (ఆదివారం) సింహాచలం అప్పన్న గిరి ప్రదర్శన మొదలుకానుంది. గిరి
ప్రదర్శనలో నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు
అంచానా వేస్తున్నారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదర్శనలో 19 కేంద్రాలు ఏర్పాటు
చేసి భక్తులకు మజ్జిగ, మంచినీటి సదుపాయం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.
జూలై 2న మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి ప్రచార రథం తొలి పావంచ వద్ద నుంచి
ప్రారంభమై 32 కిలోమీటర్లు పూర్తిచేసుకుని కొండకు చేరుకోనుంది. గిరి ప్రదర్శన
పూర్తి చేసిన భక్తులకు రేపు రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతి
ఇవ్వనున్నారు. 32 కిలోమీటర్లు నడకదారిలో వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు
కావాలసిన ఆహార పదార్థాలు అందించనున్నారు.