ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా..?
వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తిట్టడం పాలసీనా..?
ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్ర అంబటి రాంబాబు సీరియస్
అయ్యారు. భీమవరంలో పవన్ కల్యాణ్ రౌడీలా మాట్లాడాడు. పవన్ పిచ్చికుక్కలా
స్వైరవిహారం చేశాడంటూ కామెంట్స్ చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్
కల్యాణ్ అంటూ కౌంటర్ ఇచ్చారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో
మాట్లాడుతూ నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించిన పవన్ రాజకీయాల్లో
చీడపురుగు. పవన్ మాట్లాడే బూతులు అన్నీ పాలసీనా. ఉభయ గోదావరి జిల్లాల్లో
పవన్ ఎవరి జెండా ఎగరేస్తారో చెప్పాలి. పవన్ కల్యాణ్ కులాలను
రెచ్చగొడుతున్నారు. కాపులందరినీ బాబు చంక ఎక్కించాలనే పవన్ చూస్తున్నాడు.
చంద్రబాబు రావాలనేది పవన్ లక్ష్యం. పెత్తందార్ల పల్లకిని మోస్తున్న వ్యక్తి
పవన్. విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో
మాత్రమే విజయం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా?
అని ప్రశ్నించారు. కేవలం డబ్బు కోసమే పవన్ ఆడే నాటకమని జనసైనికులు
తెలుసుకోవాలని హితవు పలికారు.
విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి
జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేనను వపన్ అమ్మాడా? అని ప్రశ్నించారు. ఉభయ
గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా..? అని ఎద్దేవా చేశారు.
జగన్ పోవాలంటున్న పవన్ ఎవరు రావాలో చెప్పాలన్నారు. జగన్ పోతే సంక్షేమ
పథకాలన్నీ పోతాయి కాబట్టి జగన్ పోవాలన్న వాడే పోవాలని అంబటి అన్నారు. చెప్పు
తీసి చూపించడం పాలసీనా? లేదంటే సమస్యా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల్ని,
కార్యకర్తల్ని తిట్టడం పాలసీనా..? అని నిలదీశారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్
చీడ పురుగు అని విమర్శించారు. రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధం దెబ్బతింటుంది అది
చూసుకోవాలన్నారు. రాజకీయాలకు పనికిరాని వాడని, మ్యాడ్ డాగ్.. పిచ్చికుక్క..
అంటూ పవన్‌ను అంబటి నోటికోచ్చినట్టు దూషించారు. పవన్ కల్యాణ్ ఒక అసాంఘిక శక్తి
అని, వివాహ వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చాడన్నారు. అసలు ఆయనలోనే తేడా ఉందని,
పెళ్ళిళ్ళ విప్లవ వీరుడు అని పవన్‌ను అంబటి రాంబాబు విమర్శించారు.