మెదడును చురుకుగా మార్చడంలో ద్రాక్ష సహాయపడుతుంది. ద్రాక్ష తినడంతో మతిమరుపు
సమస్యను దూరం చేస్తుంది. నరాలను ఆరోగ్యంగా ఉంచటంలో తోడ్పడుతుంది.
కీళ్ల ఆరోగ్యం:
ద్రాక్షలో ఉండే ఫాలీఫినాల్స్ కీళ్లను ఆరోగ్యంగా మార్చుతాయి. ప్రతిరోజూ ద్రాక్ష
తినడంతో మోకాలి నొప్పి తగ్గుతుంది. ద్రాక్ష తింటే ఆస్టియో ఆర్థరైటిస్ రాదు.
రక్తప్రసరణ:
ద్రాక్షలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా
ఉంచుతాయి.కావున గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
కంటిచూపు మెరుగు:
ద్రాక్ష తినడంతో కంటి చూపు మెరుగుపడుతుంది. కంటిపై పడిన ఒత్తిడిని తగ్గించడంలో
సహాయపడుతుంది. ఏఎండీ వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది.
బీపి:
ద్రాక్షలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును
స్థిరీకరిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం పెంచుకోవచ్చు.
అస్తమా రాదు:
ద్రాక్ష తినడంతో శ్వాసవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. ద్రాక్ష తినడంతో ఆస్తమా
సమస్య దూరం అవుతుంది. ముఖ్యంగా ఎండు ద్రాక్ష తినడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
చర్మ ఆరోగ్యం:
ద్రాక్షలో రెస్వెట్రాల్ అనే యాంటి ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముడతలను తొలగిస్తుంది. ద్రాక్ష తినడంతో
వృద్ధాప్య ఛాయలు తొలగుతాయి.
యాంటీ క్యాన్సర్ ఏజెంట్:
నల్ల ద్రాక్ష తినడంతో రొమ్ము క్యాన్సర్ రాదు. ద్రాక్ష యాంటీ క్యాన్సర్ ఏజెంట్
గా పని చేస్తుంది. వివిధ క్యాన్సర్లను దూరం చేయడంలో సహాయపడుతుంది.
కొవ్వు కరుగుతుంది:
ద్రాక్ష తినడంతో నడుము చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా కరుగుతుంది. రోజూ కొన్ని
ద్రాక్ష పండ్లు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.