డోన్ పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జికి భూమిపూజ
కొత్త పురపాలక పరిపాలన భవన ప్రారంభోత్సవం
ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి,
శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
కర్నూలు మైపర్ ఫార్మసీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
తల్లిదండ్రుల విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్
నంద్యాల జిల్లా డోన్ : ప్రజల భాగస్వామ్యంతోనే డోన్ అభివృద్ధి అని ఆర్థిక,
ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ
శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. డోన్ లో కొత్త పురపాలక పరిపాలన భవనం
సకల సదుపాయాల సమ్మిళితం అని చెప్పారు. టీడీపీ హయాంలో మున్సిపల్ భవనాన్ని
3కి.మీ దూరంలో నిర్మించాలనుకున్నారని, టీడీపీ వాళ్ల వెంచర్లు, భూముల విలువ
పెరగడం కోసం పన్నిన కుట్ర అది అని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ
ప్రయత్నాన్ని అడ్డుకుని సీఎం జగన్ నాయకత్వంలోని ప్రజల ప్రభుత్వం రాగానే కట్టి
చూపించాం. ప్రజలు ఆఫీసులు, పనులకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ కార్యాలయంలో పని
చూసుకుని వెళ్లేలా అందరికీ అందుబాటులో ఏర్పాటు చేసినట్లు వివరించారు.
1912 సంవత్సరంలో రావ్ బహదూర్ శేషారెడ్డి తండ్రి హయాంలో బ్రిటీష్ కాలంలో క్లబ్
ఏర్పాటైంది. వందేళ్ల తర్వాత మళ్లీ అదే స్థలంలో బుగ్గన శేషారెడ్డి ఇండోర్
స్టేడియంను ఏర్పాటు చేశాం. రూ.60 కోట్లతో డోన్ లోని కంబాలపాడు సర్కిల్ లో
రహదారిపై వంతెన ఏర్పాటు చేసాం. బేతంచెర్ల-డోన్ వరకూ రూ.600 కోట్లపైన వ్యయంతో
జాతీయ రహదారి ఏర్పాటు దిశగా అడుగులు వేసాం. రూ.340 కోట్ల వాటర్ గ్రిడ్
ప్రాజెక్టుతో మరో 3 నెలల్లో డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికీ తాగు నీరు
అందిస్తామని చెప్పారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాల కోసం బీసీ,ఎస్సీ నివాస
పాఠశాలలు,ఐటీఐ, పాలిటెక్నిక్, ఐటీఐ హాస్టల్, కియా ఎక్స్ లెన్స్ నాలెడ్జ్
సెంటర్ లను తీసుకువచ్చాం. డోన్ లో కోట్లాది రూపాయలతో ఐటీడీఆర్ ప్రాజెక్టు,
100 పడకల ఆస్పత్రి, కూరగాయల మార్కెట్, ప్యాపిలి ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇండోర్
స్టేడియం, పార్కులు, పర్యాటక కేంద్రాలను స్థాపించాం. రూ.300 కోట్లతో డోన్
వ్యాప్తంగా 28 చెరువులకు నీరు నింపి రైతులకు సాగు నీరందించే కార్యక్రమాన్ని
పూర్తి చేశామని తెలిపారు.
రూ.12 కోట్లతో భవిష్యత్ లో డోన్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా రైల్వే అండర్
బ్రిడ్జి నిర్మాణం, 280 కుటుంబాలకు టిడ్కో భవన నిర్మాణాలను పూర్తి
చేశామన్నారు. డోన్ వ్యాప్తంగా 3,300 మందికి జగనన్న పేదలందరికీ ఇల్లు పట్టాలు
అందజేశాం. రూ.23 కోట్లతో సబ్ కోర్టు ఏర్పాటు చేయనున్నాం. రూ.10 కోట్లతో బలిజ
కమ్యూనిటీ భవన్, వడ్డెర భవన్,మైనార్టీ భవనాలను ఏర్పాటు చేస్తున్నాం. స్థలం
ఇవ్వకుండా, వసతులు ఏర్పాటు లేకుండా కూరగాయల మార్కెట్ కు పేరు పెట్టుకున్నారు.
వాళ్లు పేరు పెట్టుకున్న కూరగాయల మార్కెట్ కి కూడా సదుపాయాలను ఏర్పాటు చేశాం.
తరతరాలు కులవృత్తిలోనే బలహీన వర్గాలని పనిముట్లిచ్చిన చరిత్ర టీడీపీది. మీ
భవిష్యత్ తరాలన్నీ అభివృద్ధి చెందేలా చదువుకోవాలని ఫీజు రీయింబర్స్ మెంట్,
ఉపకారవేతనాలు, జగనన్న విద్యా కానుక, వసతి దీవెనలతో సకల సదుపాయాలను అందించిన
ప్రభుత్వం వైసీపీ. డోన్ ప్రజలు ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో
ఆలోచించాలని బుగ్గన కోరారు.
కర్నూలు మైపర్ ఫార్మసీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
తల్లిదండ్రుల విగ్రహావిష్కరణలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ
కార్యాలయాలను ఆధునీకరించడం పై జిల్లా అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి
బుగ్గన రాజేంద్ర నాథ్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తో సమీక్ష నిర్వహించారు.