లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి,
విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. శనివారం కొవ్వూరు
పట్టణంలోని 1వ వార్డు శ్రీరామ కాలనీలో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపులో
హోంమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు సర్టిఫికేట్స్, జగనన్న
సంక్షేమ క్యాలెండర్ ను అందించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను
స్వీకరించారు. టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించాలని
అధికారులను, సచివాలయ ఉద్యోగులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి
అందకుండా మిగిలిపోకూడదన్న తపనతో ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని
పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు
చేస్తున్నామన్నారు. అలాగే ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా కుల, ఆదాయ ధ్రువీకరణ
పత్రాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ముటేషన్ టైటిల్ డీడ్ కం పట్టాదార్ పాస్
పుస్తకాలు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, సిసిఆర్సి
కౌలు రైతుల కార్డులు, కొత్త రైస్ కార్డులు, రైస్ కార్డు విభజన, మరియు హౌస్
హోల్డ్ స్ప్లిట్ వంటి సేవలు 11 రకాల ధ్రువీకరణపత్రాలు సర్వీస్ ఛార్జ్ లేకుండా
ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఏమైనా చిన్న చిన్న సమస్యలు, టెక్నికల్ సమస్యలు
ఉంటే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వెంటనే సమస్య పరిష్కరించాలని
ఆదేశించారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత పారదర్శకంగా,
వివక్ష లేకుండా, అవినీతి లేకుండా డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి
జమచేస్తున్నామన్నారు. ఇంకా అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే తపనతో జగనన్న సురక్ష
కార్యక్రమాన్ని చేపట్టామని… 99 శాతం అర్హులకు పథకాలు అందుతున్నాయని, ఈ
కార్యక్రమం ద్వారా మిగిలిన ఒక్క శాతం కూడా అందేలా అధికారులు కృషిచేయాలని
హోంమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు.