తెలుగు చిత్రసీమ ఖ్యాతిని దశదిశలా చాటిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాల
వెంకటేశ్వరరావు జీవిత కథ ఇప్పుడు ‘ఘంటసాల’ ది గ్రేట్’ పేరుతో వెండితెరపైకి
వస్తోంది. కృష్ణ. చైతన్య టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాని సి.హెచ్. రామారావు
తెరకెక్కించారు. ఫణి నిర్మించారు. ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో మృదుల
నటించారు. ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే
హైదరాబాద్ లో శనివారం నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఘంటసాల అనగానే అందరి ఒళ్లు పులకరిస్తుంది. అలాంటి
గొప్ప వ్యక్తి, కథతో దర్శకుడు రామారావు ఈ ప్రయత్నం చేశారు. ఘంటసాలపై మనకున్న
అభిమానాన్ని చూపించాలంటే ఈ చిత్రాన్ని హిట్ చేయాలని ప్రేక్షకుల్ని కోరుతున్నా”
అన్నారు. “ఘంటసాల పాత్ర పోషించడం ఓ గాయకుడిగా నాకు దక్కిన అదృష్టంగా
భావిస్తున్న ఆయన ఎదుగుదలలో ఎదురైన ఆటుపోట్లు.. తన గురించి తెలియని ఎన్నో
విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయి” అన్నారు. కృష్ణచైతన్య. దర్శకుడు రామారావు
మాట్లాడుతూ.. మహా గాయకులంటే అన్నమయ్య, రామదాసు, ఒక ఘంటసాల అని భావిస్తుంటారు.
అన్నమయ్య, రామదాసులపై రాఘవేంద్రరావు సినిమాలు తీశారు. మూడో వ్యక్తి ఘంటసాలపై
సినిమా తీసే అవకాశం నాకు దక్కింది. ఆయన పాట కోసం ఎంత కష్టపడ్డారో చాలా మందికి
తెలియదు. అలాంటి ఎన్నో విషయాల్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. ఘంటసాలగా
కృష్ణచైతన్య సరిగ్గా సరిపోయాడని గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. అదే మా
తొలి విజయం అన్నారు. ఈ కార్యక్రమంలో జి.వి. భాస్కర్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్,
లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.