ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రం
విడుదలైనప్పటి నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఆదిపురుష్
చిత్రబృందానికి అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. జులై 27న చిత్రబృందం తమ ముందు
హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు తమ వెబ్ సైట్ లో
అప్లోడ్ చేసింది. అందులో దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, డైలాగ్
రైటర్ మనోజ్ మంతాషిన్ను కోర్టులో హాజరు కావాలని తెలిపింది. ఈ చిత్రం ప్రజల
మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించి తమ అభిప్రాయాలను
తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి
అలహాబాద్ హైకోర్టు సూచించింది. అంతే కాకుండా ఈ సినిమాకు సర్టిఫికెట్ మంజూరు
చేసిన నిర్ణయాన్ని కూడా సమీక్షించాల్సిందిగా ప్రభుత్వానికి నిర్దేశించింది.
కుల్దీప్ తివారీ, నవీన్ దావన్ వేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ రాజేష్
సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీ ప్రకాష్ సింగ్ తో కూడిన ఓ వెకేషన్ బెంచ్
విచారించింది. ఈ క్రమంలో సినిమా ప్రసారం కోసం సినిమా సర్టిఫికేషన్ కు
సంబంధించిన మార్గదర్శకాలను పాటించారా లేదా? అనే విషయానికి వివరణ ఇచ్చేందుకు
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్
సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) చైర్మన్లు తమ వ్యక్తిగత అఫిడవిట్లను దాఖలు చేయాలని
బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణ తేదీలోగా అవసరమైన అఫిడవిట్లను దాఖలు చేయని
పక్షంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ కంటే తక్కువ
స్థాయిలో లేని క్లాస్-1 అధికారితో పాటు సీబీఎఫ్సీకి చెందిన ఓ అధికారి
రికార్డులతో సహా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆదిపురుష్ దర్శకుడు, రచయిత అలాగే నిర్మాతలు విచారణ తేదీలోగా వ్యక్తిగత
అఫిడవిట్లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అఫిడవిట్లు వచ్చే వరకు
చిత్రబృందం సభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ
చేయబోమని స్పష్టం చేసింది.