అమూల్ డెయిరీ వల్ల పాడి రైతులకు ఎంతో మేలు
రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి
డా.పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి
ఈనెల 4 న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను
పరిశీలించిన మంత్రులు
చిత్తూరు : ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనను
విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి కె.నారాయణ స్వామి అన్నారు.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన ఏర్పాట్లకు సంబంధించి
ఆదివారం డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక,
భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్
గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, జిల్లా ఎస్పి
రిశాంత్ రెడ్డి, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు లతో కలసి బహిరంగ సభ
వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి
మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో బహిరంగ సభ వద్ద
ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని ఈ కార్యక్రమ విజయవంతానికి జిల్లా యంత్రాంగం
అన్ని చర్యలు సమర్థవంతంగా చేయడం జరుగుతున్నదన్నారు.
రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి
డా.పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్
రెడ్డి చిత్తూరు పర్యటన పాడి రైతులకు మేలు చేసేలా మూతపడిన విజయా డెయిరీని
అమూల్ డైరీ తో కలసి తిరిగి పునః ప్రారంభించడం జరుగుతుందన్నారు. అమూల్ డెయిరీ
వల్ల పాడి రైతులకు పాలు రేటు ధరలు పెరగడం జరిగిందని, తద్వారా రైతులకు మేలు
జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీల్లో భాగంగా ఈ డెయిరీ ను
పునఃప్రారంభిస్తున్నారు. ఈ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చే చీలాపల్లి
సిఎంసి ఆసుపత్రి కూడా భూమి పూజ జరుగుతుందన్నారు. 300 పడకల ఆసుపత్రి ద్వారా
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశాలున్నాయని, చీలాపల్లి
సిఎంసిలో 300 పడకల ఆసుపత్రి ప్రారంభిస్తే ఇక అనేక మంది వేలూరుకు వెళ్ళే అవసరం
తగ్గుతుందన్నారు. ఈ పర్యటనలో జెసి పి.శ్రీనివాసులు, డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్,
రాష్ట్ర మొదిలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, అడిషనల్ ఎస్పీ లు
శ్రీలక్ష్మీ, సుధాకర్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ ఈ
కృష్ణారెడ్డి, చిత్తూరు ఆర్డీఓ రేణుక, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, నగర
డిప్యూటీ మేయర్ చంద్ర శేఖర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజా
ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.