ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఏపీ సీఎం జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఎన్జీవో
సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపిజేఏసి అమరావతి చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేశారు. ప్రతినెల 3వ శుక్రవారం జీవో ద్వారా
ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ నిర్వహించడం చరిత్రలో మొదటిసారి అని బొప్పరాజు
చెప్పారు రూ. 500 కోట్లు, డీఏ, టీఏలు, సీపీఎస్ రద్దు అంశంపై 47 సమస్యలు
రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా 37 అంశాలు పరిష్కారమయ్యాయని
తెలిపారు. ఇందుకుగానూ రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యేలలో 142 మంది ఎమ్మెల్యేలకు
ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. 13 లక్షల మంది ఉద్యోగుల సమస్యల
పరిష్కారానికి అందరినీ కలుస్తున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రెండో
జోన్లో ఉన్న ఉద్యోగస్తులందరితో సమావేశమయ్యామని ఆయన అన్నారు. ఉద్యోగుల సమస్యల
పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించమని ప్రభుత్వం ప్రత్యేక జీ ఓ
విడుదల చేయడం చరిత్రాత్మకం. ఏపి జెఏసి అమరావతి కోరిక మేరకు ఇప్పటికే అత్యధిక
శాఖాధిపతులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ప్రతి నెల జిల్లా కలెక్టర్లు కూడా ఇదేవిధంగా ప్రత్యేక గ్రీవెన్స్ డే లు క్రమం
తప్పకుండా నిర్వహించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన ఉద్యమాన్ని, 92
రోజుల పాటు కష్టించి పనిచేసే కార్యాచరణను అమలు చేసి, విజయవంతం చేసిన
1.కాకినాడ, 2.తూర్పుగోదావరి, 3.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, 4. పశ్చిమ
గోదావరి, 5.ఏలూరు 6.కృష్ణా, 7.ఎన్ టీ ఆర్ జిల్లాల నాయకత్వంతో తూర్పు
గోదావరి జిల్లా చైర్మన్ పి.త్రీనాధ్ రావు అద్యక్షతన జోన్ 2 ఏడు జిల్లలలో
ఉన్న అన్ని జిల్లాల ఏపిజెఏసి జిల్లా చైర్మన్లు, ప్రధానకార్యదర్శులు జెఏసి
కమిటి, అనుబంద సంఘాల నాయకులతో ఆదివారం రెవిన్యూ భవన్ లో అభినందన సభ
నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమ వీరులకు రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు,
సెక్రెటరీ జనరల్ దామోదర రావు, అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు చేతుల
మీదుగా జిల్లా నాయకులందరికీ చిరు సత్కారం నిర్వహించిన తదుపరి ఈ ఉద్యమం
ఎలాంటి ఫలితాలు ఇచ్చినది వారికి కూలకషంగా వివరించారు. అదే విధంగా ఈ
ఉద్యమాన్ని ఉద్యోగులంధరి విజయంగా పరిగణిస్తూ ఈ విజయాన్ని ఉద్యోగులకే అంకితం
చేస్తున్నామని జెఏసి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు,
టి.వి.ఫణిపేర్రాజు అన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర రావు,
అసోసియేట్ చైర్మన్ టివి ఫణి పేర్రాజు మాట్లాడుతూ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర
నాయకత్వం ముఖ్యమంత్రి ని కలిసిన సందర్భంలో వివిధ స్థాయిలలో ఉద్యోగుల
గ్రీవియన్స్ డే లు నిర్వహించవలసిన ఆవశ్యకతను వివరించిన వెంటనే ముఖ్యమంత్రి
ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఇప్పటికే అత్యధిక శాతం శాఖాధిపతులు
ఉద్యోగుల పరిష్కారానికి సమావేశాలు నిర్వహించారు అదే విధంగా శాఖాధిపతులు,
జిల్లా కలెక్టర్లు స్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి “గ్రీవెన్స్ డే”
నిర్వహించమని జీవో విడుదల చేయడం చారిత్రాత్మకం . ఈ జీ ఓ వలన ఉద్యోగుల సమస్యలు
ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయి. సమస్యల పరిష్కారానికి “శాశ్వత పరిష్కారం”
తెచ్చిన ప్రభుత్వంకు, ముఖ్యమంత్రి కి ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున
ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపరుస్తూ అందరూ
జిల్లా కలెక్టర్లు, వారి వారి జిల్లాలో ఉన్న ఉద్యోగ సంఘాలను కలుపుకుని, ప్రతి
నెల మూడవ శుక్రవారం గ్రీవెన్స్ డే లు తప్పకుండా నిర్వహించాలని, అలా
నిర్వహించడం వలన ప్రభుత్వ స్థాయి వరకు సమస్యలు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే
పరిష్కారం అవుతాయన్నారు.
ఈ సమావేశంలో ఏపిజెఏసి అమరావతి రాష్ట్రనాయకులు కాకినాడ జిల్లా చైర్మన్ పితాని
త్రినాధ్ రావు, ప్రధానకార్యదర్శి యన్.వి.యస్.యస్.ఆర్.కె.దుర్గాప్రసాధ్ ను,
కృష్టా జిల్లా చైర్మన్ టి.వి.సతీష్, ప్రధానకార్యదర్శి వై.వి.రావు, యన్.టి.ఆర్
జిల్లా చైర్మన్ డి.శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఏలూరు
జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ , ప్రధానకార్యదర్శి బి.రాంబాబు, పశ్చిమగోదావరి
జిల్లా చైర్మన్ యస్.శివశంకర్, ప్రధానకార్యదర్శి కె.ఫణికుమార్,అంబేత్కర్
కోనసీమ జిల్లా చైర్మన్ డి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జి.చిరంజీవి,
తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ యం.కె.ప్రసాధ్ రావు, ప్రధానకార్యదర్శి
ఏ.ఆర్.శివకుమార్ తో పాటు ఆయా జిల్లా నాయకులందరిని, ఏపిపిటిడి
(ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రకార్ఙదర్శి పి. జార్జిబాబు ఈ అభినందన
సభలలో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్లాస్ 4 ఎంప్లాయీస్ రాష్ట
అద్యక్షులు యస్.మల్లేశ్వరరావు, రాష్ట్రప్రభుత్వ డ్రైవర్లు సంఘం అద్యక్షులు
సంసాని శ్రీనివాసరావు, గ్రామవార్డు సచివాలయ సంఘం రాష్ట్రఉపాద్యక్షులు
బగ్గాజగధీష్ , ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర ప్రచారకార్యదర్శి బి.కిశోర్ కుమార్,
మహిళావిభాగం రాష్ట్రకార్యదర్శి జి.జ్యోతి, వి.ఆర్.ఓ రాష్ట్రకార్యదర్శి
ఏ.సాంబశివరావు తో పాటు అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.