రూ.55 లక్షల నిధులతో చేపట్టిన పనులు ప్రారంభానికి సిద్ధం
మరో 3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి
వివరాలను వెల్లడించిన హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు : కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో దాదాపు కోటి 80 లక్షల నిధులతో చేసిన
సీసీ రోడ్లు, సీసీ డ్రైయిన్ లు, బీటీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో
రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య
అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం కొవ్వూరు మున్సిపల్ పట్టణంలో విస్తృతంగా
పర్యటించారు. మొత్తం 8 వార్డుల్లో 10 అభివృద్ధి కార్యక్రమాలను హోంమంత్రి
ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో
సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
కొవ్వూరు పట్టణంలో ఒకే రోజున దాదాపు కోటి 80 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి
కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. 18వ వార్డు సత్యవతి నగర్, 23వ
వార్డుల్లో మరో 55 లక్షల విలువ గల నిధులతో చేసిన పనులు ప్రారంభానికి సిద్దంగా
ఉన్నాయని తెలిపారు. వాటిని కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అలాగే మరో
3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని హోంమంత్రి వివరించారు.
ఇందిరమ్మ కాలనీలో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణం జగనన్న
ప్రభుత్వ హాయాంలో పూర్తిచేయడం గర్వకారణంగా ఉందన్నారు. అలాగే దశాబ్దాల కాలం
నుండి ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూశారని, ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వెసులుబాటు కారణంగానే ఆ కల నెరవేరిందని హోమంత్రి
తానేటి వనిత తెలిపారు.
హెంమంత్రి పర్యటన సాగింది ఇలా : కొవ్వూరు పట్టణం 2వ వార్డులో వినాయకుని గుడి
వెనుక నిర్మించిన సీసీ డ్రెయిన్ ను కొబ్బరికాయ కొట్టి మొదటిగా ప్రారంభించారు.
ఆ తర్వాత వరుసగా 4వ వార్డులో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద సీసీ రోడ్డును
ప్రారంభించారు. 5వ వార్డులో కుచిపూడి వారి వీధిలో సీసీ రోడ్డు, సీసీ డ్రైయిన్
ప్రారంభించారు. 6వ వార్డులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పక్కన సీసీ డ్రైయిన్
ప్రారంభించారు. 8వ వార్డులో లాంచీల రేవు నుండి విజయ్ విహార్ సెంటర్ వరకూ
నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం 10వ వార్డులో కరెంట్ ఆషీస్
వీధిలో సీసీ డ్రెయిన్, ఫ్యాక్టరీ రోడ్డును కలుపుతూ నిర్మించిన సీసీ రోడ్డును
ప్రారంభించారు. తర్వాత 14వ వార్డు పర్యటనలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి
పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిడ్జిపేటలోని అంబేద్కర్ విగ్రహాం పక్కన
వీధిలో సీసీ డ్రెయిన్ ను ప్రారంభించారు. చివరిగా 19వ వార్డు ఇందిరమ్మ
కాలనీలోని సీసీ రోడ్డులను హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. రూ. 3 కోట్ల
నిధులతో చేపట్టిన పనుల్లో కొవ్వూరు-నందమూరు రోడ్డుకి ఇరువైపుల సీసీ డ్రెయిన్ల
నిర్మాణానికి రూ.2 కోట్లు.. 7వ వార్డు, 12వ వార్డు, 22వ వార్డుల్లో సీసీ
రోడ్డు, బీటీ రోడ్డు, సీసీ డ్రెయిన్ల వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైరపర్సన్ భావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్సీ
శివరామకృష్ణ, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు
పాల్గొన్నారు.