మాసం సందర్భముగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే(గత 14
సంవత్సరాలుగా) ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ
మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం శ్రీ
అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద
ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల
భ్రమరాంబ స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి నందలి
దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి, , ట్రస్ట్
బోర్డు సభ్యులు, తెలంగాణా బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు పాల్గొని
కొబ్బరికాయ కొట్టి కార్యక్రమమును ప్రారంభించారు.
అనంతరం తెలంగాణా బోనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు జమ్మిదొడ్డి నుంచి
వివిధ కళాకారుల వేషధారణలు, కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలుతో సుమారు 500
మంది పైగా ఊరేగింపుగా బయలుదేరి రధం సెంటరు, ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారికి
సమర్పించు బంగారు బోనం తలపై ఉంచుకుని అమ్మవారి ఆలయమునకు కాలినడకన చేరుకోగా
ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ , కార్య నిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం
పలికారు. అనంతరం తెలంగాణ బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కనకదుర్గ
అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు.
అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ట్రస్ట్ బోర్డు చైర్మన్
కార్యనిర్వాహణాధికారి అమ్మవారి శేషవస్త్రములు, ప్రసాదములు అందజేశారు. ఆలయ
ఆవరణలోని రావి చెట్టు వద్ద ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, పాలకమండలి
సభ్యులు బుద్ధా రాంబాబు, కట్టా సత్తయ్య, నంబూరి రవి, చింకా శ్రీనివాసులు,
దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీ కృష్ణ, తొత్తడి వేదకుమారి,
భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ
అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజు, సభ్యులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పి.
చంద్రశేఖర్, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు.