ఖమ్మం : పొంగులేటి చేరికతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో పదికి పది సీట్లు
గెలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరు
9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. మరోపైపు
తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిన బీఆర్ఎస్ జనం సమస్యలను మాత్రం
తీర్చలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన
సభలో వీరిరువురు ప్రసంగించారు. డిసెంబరు 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్
అధికారంలో ఉంటుందని.. ఆరోజే విజయోత్సవ సభ ఇక్కడే జరుపుతామని టీపీసీసీ
అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాది
వేసింది.. ఖమ్మం జిల్లానేనని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా..
కాంగ్రెస్ సభకు భారీగా ప్రజానీకం వచ్చారని హర్షించారు. అధికారంలోకి వస్తే
సంక్షేమం, అభివృద్ధి రెండు పాదాలపై నడిపిస్తామని రేవంత్ అన్నారు. పొంగులేటి
చేరికతో ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని
జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రేవంత్
రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ప్రసంగించారు.