గుంటూరు : అమెరికాలోని డాల్లస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీడియో త్వారా తన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి
సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ
2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు.
నాటా కార్యవర్గానికి ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తో పాటు అందరికీ
శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ళ కిందట తాను డాల్లస్ వచ్చిన సందర్భం
ఇప్పటికీ గుర్తుందన్నారు. మీరంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత
ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం : ‘వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు.
గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం
ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్నల్ని అందరినీ ఒకసారి తల్చుకుంటే అక్కడ
పెద్ద, పెద్ద కంపెనీలలో సీఈఓలుగా ఐటీ నిపుణులుగా, నాసా వంటి సంస్ధల్లో కూడా
సైంటిస్టులగానూ, అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో
కూడా ఉద్యోగులుగా, బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా రాణిస్తున్న తీరుకు
మిమ్నల్ని చూసి మేమంతా ఇక్కడ గర్వపడుతున్నాం. మీలో అనేకమంది మూలాలు.. మన
గ్రామాల్లోనే కాకుండా మన మట్టిలో ఉన్నాయి. మీలో అనేకమంది పేద, మధ్యతరగతి
కుటుంబాల్లో నుంచి వచ్చినా, అక్కడకి వెళ్లి ఇలా రాణించడానికి మీ కఠోరమైన
కమిట్మెంట్, ఫోకస్ ఈ రెండూ మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. నిజంగా
మిమ్నల్ని చూసినప్పుడు ఆ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరికీ వస్తుంది. అలాం
కమిట్మెంట్, ఫోకస్ మన రాష్ట్రంలోని మన పిల్లల్లో ఎంతగానో ఉండటం నేను నా
కళ్లారా చూశాను. ఆకాశమే హద్దుగా ఆకాశాన్ని దాటి వెళ్లాలన్న కోరికతో ఉన్న వారు
ఎదగాలంటే, అందుకు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్న తపనతో ఈ నాలుగు
సంవత్సరాల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం.
చదువే సాధనం : గ్లోబల్ సిటిజన్‌గా మనం ఎదగాలంటే చదువన్నది ఒక పెద్ద అవసరమైన
సాధనం. అందుకనే రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మ మార్పులు
గమనించినట్లైతే.. మన గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు
మారుతున్నాయి. నాడు-నేడు అనే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. స్కూళ్లలో ఉన్న
మౌలికసదుపాయాల రూపురేఖలన్నీ మారుస్తున్నాం. 8వ తరగతిలోకి రాగానే మన ప్రభుత్వ
బడిలో చదువుతున్న పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్
టీచర్లను నియమించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ విద్యను
అందించేలా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. 6వతరగతి ఆపైన
అన్ని తరగతి గదుల్లోనూ ఈ డిసెంబరు నాటికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్
ఏర్పాటు పూర్తి అవుతుంది. ప్రభుత్వ బడుల్లోనే 3వ తరగతి నుంచే టోఫెల్లో
శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్ ప్రిన్స్టన్తో ఒప్పందం చేసుకున్నాం. 3వతరగతి
నుంచే టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ ఇలా పదోతరగతి వరకూ శిక్షణ ఇస్తారు.
ఇంటర్మీడియట్లో టోఫెల్ సీనియర్‌ను కూడా వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం.
విద్యావ్యవస్థలో మార్పులు : అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో
అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ కూడా ఏపీలో గొప్పగా అమలు
చేస్తున్నాం. చదువు అనే ఒక ఆయుధం ఎంత అవసరమో చెప్పడానికే ఇవన్నీ ఇంతగా
చెప్పాల్సి వస్తుంది. దీని గురించి సుదీర్ఘంగా వివరించే సమయం లేకపోయినా మన
రాష్ట్రంలో మన తర్వాత తరం గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచనలు
చేస్తున్నామోఅందరికీ క్లుప్తంగా వివరించగలిగాను. విద్యారంగం ఒక్కటే కాదు. ఏ
రంగాన్ని తీసుకున్నా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. మీ గ్రామంలో ఎప్పడూ చూడని
విధంగా విలేజ్ సెక్రెటేరియట్ మీ కళ్లెదుటనే కనిపిస్తుంది. అందులో దాదాపు 10
మంది పిల్లలు మన ఊరికి సంబంధించిన సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. బర్త్
సర్టిఫికెట్ నుంచి దాదాపు 600 రకాల సేవలు ప్రతి 2000 మందికి ఒకటి చొప్పున
గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి వాటి ద్వారా మన గ్రామంలోనే సేవలందుతున్న
గొప్ప పరిస్థితి ఉంది. మన గ్రామంలోనే ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒక
వాలంటీర్.. పౌర సేవల్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నాడు. పెన్షన్,
రేషన్ అన్నీ మన ఇంటి ముంగటికే వచ్చే గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో
కనిపిస్తుంది.
ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రం : ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా
కేంద్రం కనిపిస్తోంది. పంట విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి రైతును
చేయిపట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తుంది. ఇంకా
నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి.
మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ మీద ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా
ఎప్పడూ చూసి ఉండరు. బీపీ, షుగర్ వంటి ఎన్సీడీ డిసీజస్ పెద్ద పెద్ద రోగాలకు
ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరైన టైంలో ట్రీట్మెంట్ చేయలేకపోతే బ్లడ్
ప్రెజర్ కార్డియాక్ అరెస్టుకు, షుగర్ కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి.
రాబోయే రోజుల్లో మెడికల్ బిల్స్‌ను కట్టడి చేయాలంటే ప్రివెంటివ్ కేర్
అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. ఇవాళ ప్రివెంటివ్ కేర్‌లో ఎక్కడా చూడని
విధంగా మన గ్రామంలోనే అడుగులు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్
క్లినిక్. దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌ను
తీసుకునివచ్చాం. ఎప్పుడూ చూడని విధంగా టెర్షిరీ కేర్‌లో 17 కొత్త మెడికల్
కాలేజీలు తీసుకొచ్చాం. ఒక్క వైద్య రంగంలోనే 48వేల పోస్టులను భర్తీ చేశాం. నాడు
నేడుతో ప్రతి ఆసుపత్రిని, విలేజ్ క్లినిక్ నుంచి మొదలుకుని పీహె చ్‌సీలు,
సీహెచ్‌లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ
నాడు నేడు ద్వారా రూపురేఖలు మార్చే కార్యక్రమం జరుగుతోందన్నారు.