‘ఓదెల రైల్వే స్టేషన్ చిత్ర దర్శకుడు అశోక్ తేజ తాజాగా ఇప్పుడు ఓ యాక్షన్
థ్రిలర్ కు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సా కథానాయికగా
నటించనున్నారు. ‘జార్జి రెడ్డి ” ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న
సందీప్ మాధవ్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. దావులూరి జగదీశ్, పల్లి
కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలతో ఈ
చిత్రం ప్రారంభంకానుంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రాన్ని చివరి వరకూ
సస్పెన్స్ రివీల్ చేయకుండా రూపొందించిన అశోక్ తేజ ఈ యాక్షన్ థ్రిల్లర్ ని
కూడా అంతకుమించి తీస్తారనే ఆశాభావాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారు. త్వరలోనే
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.