అందిస్తుంది. నేరేడు పండ్లలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
*ఒక్క నేరేడు పండులో 1.1 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అలాగే 15 మిల్లీగ్రాముల
కాల్షియం ఉంటుంది.
*ఈ పండులో సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది.
*నేరేడు పండు లో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్,
ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి మరియు బి6 పుష్కలంగా ఎక్కువగా
ఉంటాయి.
*ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి ఉపయోగపడుతుంది.
*నేరేడు పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
*జీర్ణప్రక్రియను వేగవంతం చేసే లక్షణాలను నేరేడు పండులో ఉన్నాయి.
*మధుమేహంతో బాధపడే వారికి నేరేడు పండ్లు చక్కని ఔషధంగా పని చేస్తాయి.
*అధిక మూత్రం, అధిక దాహం లక్షణాలను ఇవి తగ్గిస్తాయి.
*నేరేడు పండులో ఉండే ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి.
*వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడే
అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
*నేరేడు పండు తింటే జలుబు, దగ్గు లాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా
కోలుకోవచ్చట.
*డయాబెటిక్ రోగులు ఈ పండ్లను ప్రతిరోజూ తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.
*నేరేడులోని అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ హైపర్గ్లైసీమియా లేదా అధిక రక్తంలో
చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుందట.
*నేరేడు పండ్లతో పాటు, విత్తనాలు, ఆకులు, బెరడు చాలా ఉపయోగపడతాయి.
*నేరేడు పండ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. పై తొక్క తినేసి అందులోని
విత్తనాలు ఊసేస్తారు.
*కానీ పండు మాత్రమే కాదు అందులోని విత్తనాలతో చేసిన పౌడర్ కూడా ఆరోగ్యానికి
మంచిదని నిపణులు చెప్తున్నారు.