ఆప్రికాట్ పండ్లలో విటమిన్-‘ఏ’తో పాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి
చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి.
2) పుచ్చకాయ:
పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.
అలాగే చర్మాన్ని హైడ్రేట్ చేసి సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
3)నారింజ:
ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం యొక్క ముడతల్ని తగ్గించి మీ
చర్మాన్ని “కాంతివంతంగా మారుస్తుంది.
4) బెర్రీస్:
రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా
ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని నివారించి
వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడతాయి.
5)అవకాడో:
అవకాడో పండ్లలో విటమిన్ ఇ, కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది
యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాల్ని కూడా కలిగి ఉంటుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా
మారుతుంది.
6) కివీ:
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కివి పండ్లు వృద్ధాప్య ఛాయల్ని నివారించడంలో
సహాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి శరీరానికి తేమని అందిస్తాయి.
7) ద్రాక్ష:
ద్రాక్ష పండ్లలో విటమిన్-సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ
పండ్లలోని పోషకాలు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా
మార్చడంలో సహాయపడతాయి.
8)దానిమ్మ:
దానిమ్మ పండ్లలోని విటమిన్ సి సూర్యకిరణాల వల్ల స్కిన్ పాడవ్వకుండ
కాపాడుతుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
9)బొప్పాయి:
బొప్పాయి పండులోని పోషకాలు చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజ్ చేస్తాయి. అలాగే
వృద్ధాప్య ఛాయలు రాకుండా పోరాడతాయి. చర్మం పొడిబారే సమస్యను తగ్గిస్తాయి.