ఇండియన్ ప్లమ్ అని కూడా అంటారు. ఈ పండ్లు మనకు వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తూ
ఉంటాయి. ఈ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పండ్లను
ఇష్టంగా తింటారు. రుచితో పాటు ఈ పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో
మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో వీటిని తినడం వల్ల మనకు
కలిగే ప్రయోజనాలు ఏమిటంటే…
*ఆల్ బుకరా పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి.
*100గ్రాముల ఆల్ బుకరా పండ్లల్లో 87 గ్రాముల నీటిశాతం ఉంటుంది.
*11 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 44 క్యాలరీల శక్తి, ఒకటిన్నర గ్రాముల పీచు
పదార్థాలు ఉన్నాయి.
*ఈ పండ్లల్లో తక్కువ శక్తి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
*వర్షాకాలంలో ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటాము. *వర్షాకాలంలో
చాలా మంది జబ్బుల బారిన పడుతూ ఉంటారు.
*ఈ పండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అంటువ్యాధులు,
జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి.
*జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వల్ల నోటికి రుచిగా
ఉండడంతో పాటు జ్వరం నుండి త్వరగా కోలుకుంటారు.
* ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.
*ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
*కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ రెండు పూటలా ఈ
పండ్లను 3 నుండి 4 చొప్పున మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం
మెరగుపడుతుంది.
*ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి
మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
*ఈ పండ్లని తినటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
*ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
*జీర్ణకోశం యొక్క కదలికలు పెరుగుతాయి.
*మలబద్దకం సమస్య తగ్గుతుంది.
*అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
* ఈ పండ్లల్లో నీటిశాతం ఎక్కువగా శక్తి తక్కువగా ఉంటుంది కనుక షుగర్ వ్యాధితో
బాధపడే వారు ఈ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* బరువు తగ్గడంలో కూడా ఈ పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
*ఈ విధంగా ఆల్ బుకరా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వర్షాకాలంలో
వీటిని తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుంది.