ఎవరి బలం ఎంత?
తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యాయి ఎన్సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్
వర్గాలు. ఇరువర్గాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర
ఎన్సీపీలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు బుధవారం తమ బలాన్ని
చాటుకునేందుకు సిద్ధమయ్యాయి. పార్టీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
ఎంపీలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశాయి. శరద్ పవార్ నేతృత్వంలో వైబీ
చవాన్ సెంటర్లో మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు
ఎమ్మెల్యేలు తప్పనిసరిగా రావాలని శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవహద్ విప్
జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని
ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, అజిత్ పవార్ సైతం ఎమ్మెల్యేలు, ఎంపీలతో
బాంద్రాలో ఉన్న ముంబయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశం నిర్వహించే ప్రాంతంలో అజిత్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున బ్యానర్లు,
పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ముంబయి దేవగిరిలోని ఉపముఖ్యమంత్రి
అజిత్ పవార్ నివాసానికి పెద్ద సంఖ్యలో మద్దతుదారులు చేరుకుని ఆయనకు అనుకూల
నినాదాలు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు, ఆఫీస్ బేరర్స్, వర్కింగ్
కమిటీ సభ్యులు తప్పినసరిగా హాజరు కావాలని ఎన్సీపీ బహిష్కృత నేత సునీల్ తత్కరే
నోటీసులు జారీ చేశారు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, జితేంద్ర
అవహద్ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని అజిత్ వర్గం స్పీకర్‌ను కోరింది. మరోవైపు
డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌ను ఎన్సీపీ శాసనసభ పక్షనేతగా
నియమించారు బహిష్కృత నేత ప్రఫుల్ పటేల్శరద్ పవార్ తమకు గురువు లాంటి వారని,
ఆయనను ఎప్పుడూ గౌరవిస్తామన్నారు ఎన్సీపీ బహిష్కృత నేత ప్రఫుల్ పటేల్. ఆయన తమకు
తండ్రి లాంటి వారని, ఆయన ఫొటోను గౌరవంగానే పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. దీంట్లో ఎలాంటి సందేహం వ్యక్తం
చేయాల్సిన అవసరం లేదన్నారు. 2022లో శిందే తిరుగుబాటు చేసినప్పుడు మహావికాస్
అఘాడీ ప్రభుత్వం కూలిపోయినప్పడు తాము ప్రభుత్వంలో చేరుతామని 51 మంది
ఎమ్మెల్యేలు భావించారని గుర్తు చేశారు.