విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ
నిర్మిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. జయరామ్,
సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమా
ఆఖరి షెడ్యూల్ తాజాగా ద్రాక్షారామ పరిసర ప్రాంతాల్లో మొదలైంది. ఇందులో భాగంగా
ప్రస్తుతం విజయ్, సమంత లపై క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు
తెలిసింది. ఈవారంలోనే ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. దీంతో మొత్తం చిత్రీకరణ
ముగియనుంది. వచ్చే వారంలో ఈ చిత్ర రెండో గీతాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు
చేస్తున్నారు. “విభిన్న నేపథ్యాలు కలిగిన ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే
ప్రేమకథ ఇది. విజయ్ సామ్ కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది”
అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల
ముందుకు రానుంది.