కేసిఆర్ కుటుంబాన్ని తిట్టడానికి మోడీ తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పరంపర కొనసాగుతుంది
*రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు
శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. వేల్పూర్
మండలం వేల్పూర్ – పచ్చల నడ్కూడా గ్రామాల మధ్య 5.88 కోట్లతో బిటి రోడ్ డబుల్
లైన్ గా పనుల శంకుస్థాపన,పచ్చల నడ్కుడా – కొత్తపల్లి గ్రామాల మధ్య (చింతలూరు
వరకు) 9 కోట్లతో బీటీ రోడ్ డబుల్ లైన్ పనుల శంకుస్థాపన,మోతె నుండి బడా భీంగల్
వయా అక్లూర్ 6.60 కోట్లతో బి.టి రోడ్ డబుల్ లైన్ పనుల శంకుస్థాపన
కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం కేసిఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో
అభివృద్ది పనుల పరంపర కొనసాగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల
ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి పక్షాలు ఎంత అసత్య ఆరోపణలు చేస్తే అంతకు
రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తా..విమర్శలకు వెన్నక్కి తగ్గే ప్రసక్తే లేదని
మంత్రి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటే ఏం చేశారని
ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు నియోజక
వర్గ అభివృద్ది కోసం ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. అభివృద్ధి లో తనతో
పోటీ పడాలని,అభివృద్ది నిధుల మంజూరు చేయించి తనలాగా జి ఓ కాపీలు చూపెట్టాలని
సవాల్ చేశారు. అభివృద్ది చేస్తున్న వారెవరో మాటలు చెప్తున్న వారెవరో ప్రజలకు
తెలుసని తనను బాల్కొండ నియోజకవర్గ ప్రజలు గుండెలో పెట్టుకుంటారని ఆశాభావం
వ్యక్తంచేశారు. మంచి పనులు చేస్తున్న వారిని ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడు
కుంటారని ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన పై విలేకరులు అడిగిన ప్రశ్నపై మంత్రి
మాట్లాడుతూ మోడీ పర్యటన కు వచ్చే ముందు 1000 కోట్లు రెండు వేల కోట్ల ప్యాకేజ్
ఇచ్చి తెలంగాణ కు రావాలి.గుజరాత్, యూపీ, కర్ణాటక కు ఎలాగైతే మెట్రో పనులకు
డబ్బులు ఇచ్చావో అలాగే తెలంగాణ మెట్రో పనులకు డబ్బులు ఇవ్వాలి. కాళేశ్వరం
,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి.తెలంగాణ కు వచ్చి
కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికి కవిత ను జెల్లో వేస్తాం అని అనడానికి తెలంగాణ
కు రావద్దు. అన్ని రాష్ట్రాల ను సమానంగా చూసే బాధ్యత ప్రదాని పై ఉంటుంది
ప్రధాని అన్ని రాష్టలకు తండ్రిలాటివాడు. యూపీ గుజరాత్ కి డబ్బులు ఎక్కువిచి
తెలంగాణ మొండి చేయి చూపడానికి తెలంగాణ కు రావద్దని మంత్రి అన్నారు. ఈ
కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,బి ఆర్ ఎస్
నాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.