ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
అమరావతి : రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై
హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ గృహనిర్మాణాలకు సుప్రీంకోర్టు
అనుమతించిందా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు
న్యాయవాదులు స్పందిస్తూ పూర్తి వివరాలకు కొంత సమయం కావాలని కోరారు. అనంతరం
తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 11కి వాయిదా వేసింది.