న్యూఢిల్లీ : ఎల్వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను
అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. శ్రీహరికోటలోని
సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో వాహన అనుసంధాన భవనంలో (ఎస్వీఏబీ)
3,900 కిలోల పేలోడ్‌ను రాకెట్ శిఖర భాగాన అమర్చారు. ఈ నెల 13న చంద్రయాన్-3
ప్రయోగాన్ని నిర్వహించనున్నామని ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ శాటిలైట్ సెంటర్లో తయారు చేయగా షార్కు
తీసుకొచ్చాక శాటిలైట్ ప్రిపరేషన్ బిల్డింగ్ (ఎస్పీబీ)లో ల్యాండర్, రోవర్
ప్రొపల్షన్ మాడ్యూల్తో అనుసంధానించారు. ఉపగ్రహం సుమారు 3,84,000 కి.మీ.
ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది.
తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని
ఇస్రో తెలిపింది.