టిడ్కో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సీఎం అంగీకారం
టిడ్కో ఇళ్ల వద్ద వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా
గృహనిర్మాణాశాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
<
గుంటూరు : గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. జగనన్న
కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్,
ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణం ప్రగతిపై అధికారులు వివరాలు
అందించారు. ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల
ఇళ్లు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.
కోర్టు కేసులతో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిన చోట భూసేకరణపై దృష్టి పెట్టాలని
సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులతో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిన
చోట భూసేకరణపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖపై జగన్ సమీక్ష
నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులపై సీఎంకు
అధికారులు వివరించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయిందని తెలిపారు.
సీఆర్డీఏలో ఇళ్ల నిర్మాణంపై కోర్టు విచారణ అంశాన్ని అధికారులు సీఎం వద్ద
ప్రస్తావించారు. విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని సీఎం
ఆదేశించారు. డిసెంబర్లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం పూర్తికి కార్యాచరణ
చేపట్టాలని కోరారు. టిడ్కో ఇళ్ల వద్ద వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం
పచ్చజెండా ఊపారు. తొలిదశలో 15 టిడ్కో కాలనీల్లో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు
చేయాలని నిర్ణయించారు. టిడ్కో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సీఎం
అంగీకారం తెలిపారు.
గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక,
పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్
అజయ్ జైన్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్
లిమిటెడ్ ఎండీ డాక్టర్ జి లక్ష్మీషా, ఏపీ జెన్కో ఎండీ కె వి యన్ చక్రధర్ బాబు,
గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ బి మహమ్మద్ దీవాన్, మైన్స్ అండ్ జియాలజీ
డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.