అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో మాజీ ఎంపీ,
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని
క్యాంపు కార్యాలయంలో పొంగులేటి సీఎం జగన్ను కలిశారు. ఇటీవలే రాహుల్ గాంధీ
సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం జగన్తో
పొంగులేటి సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. వైతెపా
అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ
జరిగినట్టు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గత కొంతకాలంగా
ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.